News


హైదరాబాద్‌లో రెంట్‌మోజో సేవలు షురూ

Tuesday 18th July 2017
news_main1500321277.png-5535

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌ వేదికగా గృహ, కార్యాలయాల్లోని ఫర్నీచర్‌ ఇతరత్రా ఉత్పత్తులను అద్దెకిచ్చే రెంట్‌మోజో హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, పుణె, చెన్నై, ముంబై నగరాల్లో సుమారు 25 వేల మంది యూజర్లుండగా.. ఈ ఏడాది ముగింపు నాటికి 50 వేలకు చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెంట్‌మోజో ద్వారా ఫర్నీచర్, అప్లియెన్సెస్, బైకులు, వాషింగ్‌ మిషన్లు, రిఫ్రిజిరేటర్, కార్యాలయ ఫర్నీచర్‌ వంటి ఉత్పత్తులను అద్దెకు తీసుకోవచ్చని రెంట్‌మోజో ఫౌండర్‌ అండ్‌ సీఈఓ గీతాన్ష్‌ బమానియా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు కేంద్రంగా 2014లో ప్రారంభమైన ఈ కంపెనీ ఇప్పటివరకు 7 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది. అస్సెల్, ఐడీజీ వెంచర్స్‌ ఈ పెట్టుబడులు పెట్టారు.







You may be interested

రూ. 200 కోట్లు సమీకరించనున్న ఫినో పేమెంట్స్ బ్యాంక్‌

Tuesday 18th July 2017

ముంబై: బిజినెస్ కరెస్పాండెంట్స్ సంస్థ ఫినో సోమవారం చెల్లింపుల బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించింది. రాబోయే కొద్ది నెలల్లో సుమారు రూ. 200 కోట్లు మూలధనం సమీకరించనున్నట్లు ఈ సందర్భంగా ఫినో ఎండీ రిషి గుప్తా తెలిపారు. వచ్చే నాలుగేళ్లలోగా లిస్టింగ్ యోచన కూడా ఉన్నట్లు వివరించారు. "మాకు సుమారు రూ. 600 కోట్ల మేర మూలధనం అవసరం కాగా.. గత విడతలో రూ. 400 కోట్లు మాత్రమే సమీకరించాం. వచ్చే

క్యూ2లో చైనా వృద్ధి 6.9%

Tuesday 18th July 2017

 6.5 శాతం లక్ష్యం కన్నా అధికం బీజింగ్‌: ఈ ఏడాది రెండో త్రైమాసికంలో చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.9 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. ఇది ప్రభుత్వం లక్యంగా నిర్దేశించుకున్న 6.5 శాతం కన్నా అధికం. ఈ నేపథ్యంలో అధిక రుణభారం ఉన్నప్పటికీ.. 2017 వృద్ధి లక్ష్యాలను చైనా సునాయాసంగా అధిగమించగలదని పరిశీలకులు భావిస్తున్నారు. దాదాపు తొలి త్రైమాసికం స్థాయిలోనే రెండో త్రైమాసికంలోనూ వృద్ధి నమోదైంది. తమ

Most from this category