News


నెలలో ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌: లిమాయే

Tuesday 18th July 2017
news_main1500320586.png-5530

  • కో లొకేషన్‌ అంశంపై పరిష్కారమే తొలి ప్రాధాన్యం
  • ఎన్‌ఎస్‌ఈ నూతన ఎండీ లిమాయే

న్యూఢిల్లీ: కో లొకేషన్‌ అంశంపై ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) నెలలోపు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక సమర్పించనుందని ఎన్‌ఎస్‌ఈ నూతన ఎండీ విక్రమ్‌ లిమాయే తెలిపారు. దీనిపై సకాలంలో తగిన పరిష్కారాన్ని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఎన్‌ఎస్‌ఈ నూతన ఎండీగా సోమవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం లిమాయే మీడియాతో మాట్లాడారు. కో లొకేషన్‌ అంశాన్ని పరిష్కరించడమే తన తొలి ప్రాధాన్యమన్నారు. ఈ విషయంలో సెబీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కొంత మంది బ్రోకర్లు ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌పై సత్వరమే లాగిన్‌ అయ్యేందుకు ప్రత్యామ్నాయంగా వేదిక ఏర్పాటు చేసుకుని యాక్సెస్‌ పొందారనే ఆరోపణలు వచ్చిన సంగతి విదితమే. ఈ విధంగా బ్రోకర్లు కరెన్సీ, డెరివేటివ్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా భారీగా లాభపడ్డారని ఆరోపణలు రావడంతో దీనిపై సెబీ దర్యాప్తు మొదలు పెట్టింది. మరోవైపు ఎస్‌ఎస్‌ఈ సైతం ఆడిట్‌ బాధ్యతల్ని ఈవైకి అప్పగించింది. ఎక్సేంజ్‌ వైపు ఏవైనా లోపాలుంటే వాటిని సరిచేసి వ్యవస్థను బలోపేతం చేస్తామని లిమాయే చెప్పారు.
ఆ తర్వాతే ఐపీవో
కో లోకేషన్‌పై దర్యాప్తు ముగిసి ఈ అంశం పరిష్కారమైన తర్వాతే ఎన్‌ఎస్‌ఈ ఐపీవో ఉంటుందని టీవీ చానళ్లతో మాట్లాడుతూ లిమాయే చెప్పారు. ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, క్లయింట్లు, మీడియా, ఉద్యోగులతో సంబంధాలు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయని హామీ ఇచ్చారు. ఇటీవల ఎన్‌ఎస్‌ఈ మూడు గంటల పాటు నిలిచిపోవడంపై స్పందిస్తూ సాఫ్ట్‌వేర్‌ సమస్యలు అసాధారణమేమీ కాదన్నారు. దీనిపై నివేదిక కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు. ఎన్‌ఎస్‌ఈ టెక్నాలజీ స్టాండింగ్‌ కమిటీ సమస్యను సమీక్షించి భవిష్యత్తులో ఈ తరహా అవాంతరాలు ఎదురు కాకుండా తీసుకోవాల్సిన చర్యల్ని సూచిస్తుందన్నారు. సమస్యకు మూల కారణంపై ఆర్థిక శాఖకు, సెబీకి నివేదిక ఇస్తామని చెప్పారు. ఎన్‌ఎస్‌ఈని మరింత మెగుగైన స్థానంలో నిలిపేందుకు అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని అంతకుముందు ఉద్యోగులకు లిమాయే పిలుపునిచ్చారు. 







You may be interested

'దివాలా చట్టం'పై ఎస్సార్ స్టీల్‌కు చుక్కెదురు

Tuesday 18th July 2017

 చర్యలు నిలిపివేయాలన్న అభ్యర్ధనకు కోర్టు  నో అహ్మదాబాద్: దివాలా చట్టం కింద చర్యలు నిలిపివేయాలంటూ గుజారాత్ హైకోర్టును ఆశ్రయించిన ఉక్కు తయారీ సంస్థ ఎస్సార్‌ స్టీల్‌కు చుక్కెదురైంది. కంపెనీ అభ్యర్ధనను న్యాయస్థానం కొట్టేసింది. ఎస్సార్ స్టీల్ రుణభారం రూ.42,000 కోట్ల పైచిలుకు ఉంటుంది. ఇలా మొండిబాకీల భారం పెరిగిపోయిన 12 కంపెనీలపై ఆర్‌బీఐ సూచనల మేరకు బ్యాంకులు దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్‌బీఐ ఆదేశాలను

రూ.999లకే నోకియా ఫీచర్‌ ఫోన్‌

Tuesday 18th July 2017

న్యూఢిల్లీ: నోకియా బ్రాండ్‌ అధికారాలు చేజిక్కించుకున్న ‘హెచ్‌ఎండీ గ్లోబల్‌’ తాజాగా ‘నోకియా-105’ మోడల్‌లో కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.999. ఇందులో 1.8 అంగుళాల కలర్‌ స్క్రీన్‌, ఎల్‌ఈడీ టార్చ్‌లైట్‌, కొత్త డిజైన్‌, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్‌ వంటి పలు ప్రత్యకతలున్నాయని కంపెనీ పేర్కొంది. ఫీచర్‌ ఫోన్‌ మార్కెటే ప్రధాన లక్ష్యంగా కంపెనీ ఈ మోడల్‌ను తీసుకువస్తోంది. ఇక డ్యూయెల్‌ సిమ్‌ వెర్షన్‌ ఫోన్‌ ధర రూ.1,149గా

Most from this category