News


కర్ణాటక బ్యాంకుకు క్యూ1 ఫలితాల షాక్‌

Monday 17th July 2017
Markets_main1500281454.png-5507

క్యూ1 ఫలితాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోవడంతో కర్ణాటక బ్యాంక్‌ కౌంటర్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సోమవారం బ్యాంకు షేరు ధర నాలుగు శాతం పడిపోయింది.  ప్రస్తుతం కంపెనీ షేరు రూ.159 వద్ద ట్రేడవుతోంది.ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసిక  ఫలితాలను శనివారం బ్యాంకు ప్రకటించిం‍ది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌తో పోలిస్తే   నికర లాభం‍10 శాతం​ఎగసి రూ.132 కోట్లను ఆర్జించింది.వడ్డీ ఆదాయం​ 16 శాతం​ పెరిగి రూ.424 కోట్లకు చేరింది. కరెంట్‌, సేవింగ్స్‌ ఖాతాదారుల డిపాజిట్లు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే  2.42 శాతం పెరిగాయి. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.2 శాతం పెరిగాయి. బ్యాంకు అపరేటింగ్‌ లాభం 18 శాతం పుంజుకుని రూ. 310 కోట్లను సాధించింది.కాగా బ్యాంకు షేరు ఏడాది గరిష్ట, కనిష్ట స్థాయిలు వరుసగా రూ.181 రూ.100 గా నమోదయ్యాయి.







You may be interested

25 శాతం రాబడి కోసం 2 షేర్లు..

Monday 17th July 2017

ఎడెల్‌వీస్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు సమీప భవిష్యత్‌లో 25- 30 శాతం రాబడినిచ్చే సత్తా ఉన్న షేర్లు వేదాంత, ఐసిఐసిఐ బ్యాంక్‌ అని ఎడెల్‌వీస్‌ సెక్యూరిటీఽస్‌ ప్రతినిధి నిశ్చల్‌ మహేశ్వరి అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ధరల వద్ద వేదాంత ఇవి- ఎబిటా నిష్పత్తి 3రెట్లుందని, డివిడెండ్‌ ఈల్డ్‌ 4- 5 శాతం ఉందని చెప్పారు. ఈ స్థాయిల వద్ద వేదాంత షేర్లను సమీకరించడం ఉత్తమం అని సూచించారు. మరోవైపు ఐసిఐసిఐ లుంబార్డ్‌ పబ్లిక్‌

‘‘షేర్ల’’ డాక్టర్‌ సలహాలు విందామా...

Monday 17th July 2017

మార్కెట్లో లాభాల పంట పండిస్తున్న డా. విజయ్‌ మాలిక్‌ డా. స్టాక్‌గా వర్ణిస్తున్న వాల్యూ ఇన్వెస్టర్లు మార్కెట్లో ఈ రోజు పెట్టుబడి పెట్టి రేపటికి భారీ లాభాలు రావాలని ఆశించి భంగపడేవాళ్లు డా. విజయ్‌మాలిక్‌ కథ తెలుసుకోవాలి. మల్టీబాగర్లను ఎంచుకునేందుకు విజయ్‌ ఉపయోగించే బాటమ్స్‌ అప్‌ విధానం ఆయనకు ఎంతో లాభాన్ని ఆర్జించిపెట్టింది. తన విధానానికి ఆయన ‘‘ పీస్‌ఫుల్‌ పెట్టుబడి’’ అని పేరుపెట్టుకున్నారు. పేరుకు తగ్గట్లే ఎటువంటి టెన్షన్లు, భయాలు లేకుండా

Most from this category