News


కేడిలా హెల్త్‌కేర్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ బూస్టింగ్‌

Monday 17th July 2017
Markets_main1500279525.png-5504

ముంబై:- కాడిల్లా హెల్త్‌కేర్‌ షేరు సోమవారం ఇంట్రాడేలో 2శాతానికి పైగా లాభపడింది. కాడిల్లా అనుబంధ సంస్థ జైడస్‌ యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి ఫింగోలిమోడ్‌ ఔషదానికి తాత్కాలిక అనుమతులు పొందినట్లు గత శుక్రవారం(జూలై 14) ప్రకటించింది. అనుమతి పోందిన ఫింగోలిమోడ్‌ ఔషదాన్ని మల్టిపుల్ స్కెరోసిస్(నాడీ శాఖలపై క్షీణత వల్ల సంభవించే కండర బలహీనత)వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ ఔషద అమ్మకాల మార్కెట్‌ విలువ సుమారు 13వేల కోట్లుగా ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఔషధ అనుమతి వార్తలతో కేడిలా కౌంటర్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. బీఎస్‌ఈలో ఈ రోజు ఇంట్రాడేలో 2శాతానికి పైగా లాభపడి రూ.545ల గరిష్టస్థాయిని తాకింది. ప్రస్తుతం గం.1:00లకు నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే 2శాతం లాభపడి రూ.543ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక షేరు యేడాది కనిష్ట, గరిష్టధరలు వరుసగా రూ. 329, రూ.558లుగా నమోదు చేసింది.







You may be interested

‘‘షేర్ల’’ డాక్టర్‌ సలహాలు విందామా...

Monday 17th July 2017

మార్కెట్లో లాభాల పంట పండిస్తున్న డా. విజయ్‌ మాలిక్‌ డా. స్టాక్‌గా వర్ణిస్తున్న వాల్యూ ఇన్వెస్టర్లు మార్కెట్లో ఈ రోజు పెట్టుబడి పెట్టి రేపటికి భారీ లాభాలు రావాలని ఆశించి భంగపడేవాళ్లు డా. విజయ్‌మాలిక్‌ కథ తెలుసుకోవాలి. మల్టీబాగర్లను ఎంచుకునేందుకు విజయ్‌ ఉపయోగించే బాటమ్స్‌ అప్‌ విధానం ఆయనకు ఎంతో లాభాన్ని ఆర్జించిపెట్టింది. తన విధానానికి ఆయన ‘‘ పీస్‌ఫుల్‌ పెట్టుబడి’’ అని పేరుపెట్టుకున్నారు. పేరుకు తగ్గట్లే ఎటువంటి టెన్షన్లు, భయాలు లేకుండా

 35 వేలకు సెన్సెక్స్‌ !

Monday 17th July 2017

  ఈ ఏడాది చివరికల్లా సాధ్యమంటున్న విశ్లేషకులు స్టాక్‌ మార్కెట్‌ పరుగు కొనసాగుతోంది. స్టాక్‌ సూచీలు రోజూ​ కొత్త శిఖర స్థాయిలను తాకుతున్నాయి. ఈ జోరు చూస్తుంటే ఈ ఏడాది చివరకు సెన్సెక్స్‌ 35వేల పాయింట్లనను, నిఫ్టీ పదివేల పాయింట్లను మించుతాయని విశ్లేషకులంటున్నారు. వేల్యూయేషన్లు అధికంగా ఉన్నా, స్టాక్‌ సూచీలు పరుగు కొనసాగుతుందని వారంటున్నారు. ఈ ఏడాది సెన్సెక్స్‌ ఇప్పటివకూ 5,000 పాయింట్లు లేదా 20 శాతం లాభపడింది. ఇక నిఫ్టీ 1,700

Most from this category